ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక టాపిక్ బాగా హాట్‌గా మారింది . అదే నటసింహ నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసే ప్రయత్నం. “బాలయ్యను తొక్కే ప్లాన్ జరుగుతోందా?” అనే ప్రశ్నకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “అవును” అన్న సమాధానమే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ విజయాల తరువాత, రాజకీయంగానూ, సినిమాల పరంగానూ బాలయ్య చేసే ప్రతి చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. దాంతో “బాలయ్య క్షమాపణలు చెప్పాలి” అంటూ మెగా క్యాంప్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో మరో కోణం కూడా గమనించదగ్గది. కొంతమంది సోషల్ మీడియా టీమ్స్ బాలయ్య చేసే ప్రతి పనినీ నెగటివ్‌గా చూపిస్తూ, ట్రోల్ మీమ్స్ తయారు చేస్తూ, ఆయనను ఎప్పటికప్పుడు చర్చలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సినిమాల నుంచి వచ్చిన చిన్న అప్డేట్ అయినా, చిన్న వీడియో అయినా, దానిని తప్పుగా అర్థం చేసుకుని ట్రోలింగ్ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది.


ఇదిలా ఉండగా, బాలయ్య తాజాగా చేస్తున్న ‘అఖండ 2’ సినిమా మీద కూడా ఇదే బృందం దృష్టి పెట్టిందని టాక్. డిసెంబర్ 5న ఈ భారీ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే, డిసెంబర్ 1 నుంచే సినిమా రిలీజ్ అడ్డుకునేలా ఒక ప్రణాళిక పక్కాగా వేసుకుంటున్నారని, సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. “బాలయ్య సినిమాను బాయ్‌కాట్ చేయాలి” అంటూ కొంతమంది ప్రత్యేక టీమ్స్ ప్రచారం చేస్తూ కనిపిస్తున్నారు. అయితే, నందమూరి అభిమానులు మాత్రం ఈ ట్రెండ్‌కి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. “బాలయ్యను ఎవ్వరూ తొక్కలేరు. ఆయన సినీ చరిత్రలో తన స్థానం ఎవరికీ అందదు” అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. బాలయ్యను ఇంత టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం రాజకీయమా, లేక సినిమా కంపిటీషనా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.



నందమూరి ఫ్యాన్స్  — “బాలయ్యకు ఇంత పగ చూపడం సరైనది కాదు. ఆయన సినిమా పట్ల ఇంత నెగిటివ్ వాతావరణం సృష్టించడం మరీ తగదు. బాలయ్య ఎప్పుడూ తన మాటల్లో నిజాయితీగా ఉంటాడు, కానీ దానిని తప్పుగా అర్థం చేసుకోవడం ఒక పెద్ద తప్పు” అని అంటున్నారు. ఇక మరోవైపు, సోషల్ మీడియాలో బాలయ్య హేటర్స్ మాత్రం ఆయన ప్రతి మూవీని నెగిటివ్‌గా చూపించేందుకు కొత్త కొత్త మీమ్స్, ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ల ఉద్దేశం బాలయ్యను సినీ పరంగా దెబ్బతీయడం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



ఏమైతేనేం, “బాలయ్యను ఎవరు తొక్కలేరు” అంటూ నందమూరి అభిమానులు ధైర్యంగా నిలుస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలో యాంటీ క్యాంపెయిన్‌లు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో బాలయ్య పేరు చుట్టూ మరోసారి హాట్ వాతావరణం నెలకొంది.డిసెంబర్ 5న రానున్న ‘అఖండ 2’ సినిమాతో బాలయ్య మరోసారి తన సత్తా చూపిస్తారా? లేక సోషల్ మీడియా నెగిటివ్ వేవ్ ఆయన సినిమాపై ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్ అంతా గమనిస్తున్న హాట్ టాపిక్‌గా మారిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: