
ఏకంగా తనకు పెళ్లయిపోయింది అన్న విషయాన్ని బయట పెట్టాడు. పెళ్లి కావడమే కాదు ఒక అందమైన కూతురు కూడా ఉంది అన్న విషయాన్ని చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే యాంకర్ రవి చెబుతుంది నిజమేనా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇదంతా చెబుతున్నాడా.. అతనికి పెళ్లి కావడం ఏంటి.. అలా జరిగి ఉంటే ఇప్పటివరకు మీడియా ఎప్పుడో బయట పెట్టేసేది కదా అనే విషయంపైనే అందరూ కొన్నాళ్లపాటు చర్చించుకున్నారు అని చెప్పాలి. అయితే తన పెళ్లి విషయం దాచిపెట్టడానికి వెనుక అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు యాంకర్ రవి.
మా మ్యూజిక్ లో సంథింగ్ స్పెషల్ ఎంత హిట్ అయిందో ఎంత టిఆర్పి వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ బయటకు వెళ్లిన సంథింగ్ స్పెషల్ గురించి మాట్లాడుతారు ఎంతోమంది. అప్పుడే నాకు పెళ్లయింది. అయితే పెళ్లి అయింది అని తెలిస్తే యూత్ ఫీల్ పోయి ఎక్కడ అంకుల్ ఫీల్ వస్తుందో అని ఒక రాంగ్ వేలో థింక్ చేశాను. పెళ్లయిపోయింది కాబట్టి అవకాశాలు రావు అనే భయం ఉండేది. యూత్ లో ఉన్న గర్ల్ ఫ్యాన్స్ తగ్గిపోతారేమో అనుకున్న.. అయితే పెళ్లయిపోతే అంకుల్ అయిపోతాం అనేది నా మైండ్లో ఉండిపోయింది. అందుకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము నేను, నిత్య. ఏ యాంకర్ తో చేస్తే ఆ యాంకర్ తో లింకప్ చేస్తుండే సరికి పటాస్ షో టైం లో మా పెళ్లి ఫోటో రిలీజ్ చేశా. అప్పటికి సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. నిత్య మా అందరి హెల్త్ గురించి బాగా చూసుకుంటుంది. ఇక మా అమ్మాయి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు.