టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా దసరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అవుతుంది. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది.ఇటీవలే విడుదలైన దసరా సినిమా ట్రైలర్ కి సూపర్ స్పందన లభించింది. ఈ ట్రైలర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయగా ఏకంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. అలాగే 4.60 లక్షల లైకులను ఈ ట్రైలర్ రాబట్టింది.


తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఒకే రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక అమెరికాలో ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల లాగా ఏకంగా 600 కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా భారీగా వసూళ్లు రావడం ఖాయం. ఇంకా అంతేగాక నాని కూడా టాలీవుడ్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా అవ్వడం ఖాయం.ఇక ఈ సినిమాలో నాని ధరణిగా కనిపిస్తుండగా.. ఊర మాస్ లుక్ లో సూపర్ గా అదరగొట్టాడు. ఇంకా అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్లు ఇంకా పవర్ ఫుల్ డైలాగ్స్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఈ ట్రైలర్ ను చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇంకా అంతేకాదు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని టాలీవుడ్ అభిమానులు తెగ వేచి చూస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: