
ఇక ఇందులో ప్రధానపాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తేజ్ లు కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కాగా ఈ సినిమాను జపాన్ దేశంలో అక్టోబర్ 21 లో రిలీజ్ చేశారు... అయితే అక్కడ ఇప్పటికి 20 వారాలు కావస్తున్నా రెండు వందల థియేటర్ లలో ప్రదర్శించబడడం గొప్ప విషయంగా ట్రేడ్ పండితులు మరియు సినిమా వర్గాలు భావిస్తున్నారు. ఇప్పుడు సినిమాలు థియేటర్ లో మూడు వారాలు ఆడితే గొప్ప, ఇక హిట్ సినిమాలు అయితే 50 రోజులు ఆడడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాంటిది "ఆర్ ఆర్ ఆర్" సినిమా మాత్రం ఇరవై వారాలుగా ఆడుతోంది.
అంటే... శతదినోత్సవం పూర్తి అయ్యాక కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇండియన్ సినిమా కూడా జపాన్ లో ఈ స్థాయిలో రన్ అయింది లేదు. గతంలో ముత్తు సినిమా ఒక్కటే... 400 మిలియన్ యాన్ లను కలెక్ట్ చేసింది. కానీ ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఇప్పటికే వెయ్యి మిలియన్ యాన్ లను అందుకుంది. ఇంకా ఎన్ని రోజులు జపాన్ లో ఈ సినిమా ప్రదర్శితం అవుతుందన్నది చూడాల్సి ఉంది.