ఎన్టీఆర్ 30 లో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అని అలాగే ఎన్టీఆర్ 30 పూజా వేడుక కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు అని, సైఫ్, జాన్వీ తో కలిసి పూజా కార్యక్రమాల కు అటెండ్ అవుతున్నాడని..కొన్ని రూమర్స్ వినడాని కి చాలా 
బావున్నాయి కదా. ఇందు లో నిజం ఉందో లేదో మరీ తెలియదు కానీ.. వినడానికి మాత్రం భలే ఉన్నాయని నెటిజన్లు కూడా చెప్పుకొస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా మార్చి 23 న పూజా కార్యక్రమాలను జరుపుకొంటుందని సమాచారం.. దీంతో ఈ వేడుకను కొరటాల ఎంతో గ్రాండ్ గా చేయాలనీ కూడా ప్లాన్ చేస్తున్నాడట. 

ఇక ఈ పూజా కార్యక్రమం లో బాలీవుడ్ నటుడు అయిన సైఫ్ అలీఖాన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ముఖ్య అతిధులుగా రానున్నారట. సైఫ్ ఎన్టీఆర్ 30 లో విలన్ గా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.. పాన్ ఇండియా సినిమా కావడం అలాగే సైఫ్ ఆల్రెడీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా లో నటించడంతో మంచి గుర్తింపు రావడానికి సైఫ్ ను విలన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.ఇక చిరును ప్రత్యేకంగా కొరటాల ఆహ్వానించాడని సమాచారం.. ఆచార్య సినిమా పరాజయం పాలయినా వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు కూడా వినిపించాయి. ఆ వార్తలు అస్సలు నిజం కాదు అని చెప్పడానికి చిరును కొరటాల పిలిచినట్లు సమాచారం.మరి ఇందులో ఎంత వరకు నిజం అనేది తెలియాలి మరీ.ఈ వార్త నిజం కావాలని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: