
వృత్తి పరమైన విషయాలతో పాటు వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను అడిగి ప్రేక్షకులకు తెలియజేస్తుంది. ఆకట్టుకునే విధంగా ఉన్న ఆ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడం లేదు. సోనీ లివ్ తెలుగు లో ఎక్కువ ప్రేక్షకులను కలిగి లేదు. కనుక ఎక్కువ మంది ఆ కార్యక్రమాన్ని చూడడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అతి త్వరలోనే ఆ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తవుతుంది. పెద్ద గా సక్సెస్ కాలేదు కనుక రెండవ సీజన్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగర్ స్మిత ఎంతో కష్టపడి చేస్తున్న షో. సోనీ లివ్ వారు కాస్త ఎక్కువగా ఖర్చు చేసి రూపొందించిన ఈ షో ను జనాలు చూడక పోవడం పట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోస్ట్ ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ అయి ఉంటే ఫలితం మరో లా ఉండేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సింగర్ స్మిత తనవంతు టాక్ షో ను అద్భుతంగా నడిపించే ప్రయత్నం చేస్తుంది కానీ ఆడియన్స్ ను మాత్రం రాబట్టుకోలేక పోయింది.
దానికి నేటిజన్లు వెరైటీ గా 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ' అని విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు.