
ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తో శుభలేఖ సుధాకర్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటన గురించి, ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. టేక్ అనగానే మూడు నాలుగు పేజీల డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. సెట్లో ఎప్పుడూ సరదాగా ఉండే ఎన్టీఆర్ డైలాగు పేపర్ చూసుకోవడం ఇంతవరకు నేను చూడలేదు. అలాంటి గొప్ప నటుడు ఎన్టీఆర్.. ఆయన నటన కోసమే .. కెమెరా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది.
ఇదంతా సినిమా పట్ల ఆయనకున్న కసి, కృషి మాత్రమేనని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ అనడంలో సందేహం లేదు అంటూ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు శుభలేఖ సుధాకర్. ఇకపోతే ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రం ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా లోకల్ స్టార్ కాస్త ఒక సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారంటంలో సందేహం లేదు.