తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి పాకీజా. దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. పాకీజా కొన్ని రోజుల క్రితం ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ కు హాజరైంది. అందులో తన పరిస్థితిలను గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు అండగా నిలవడం జరిగింది.మొదట నాగబాబు ఆ తర్వాత చిరంజీవి ఇలా ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తన సొంత డబ్బులతో ఈమెకు మా అసోసియేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది.


ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీల సహాయంతో కొంత మేరకు పాకీజా చేరుకున్నప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో తాజాగా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన గెటప్ లోనే పాకీజా ఎంట్రి ఇవ్వడం జరిగింది. ఈమె అసలు పేరు వాసుకి. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాకీజా పాత్రలో పాపులారిటీ కావడంతో ఆ పేరుని పెట్టుకుంది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతుంది సెలబ్రిటీ స్పెషల్ టీం తో చేసిన ఈ ఎపిసోడ్లు నటుడు విశ్వక్సేన్.. రైటర్ ప్రసన్న ముఖ్య అతిథులుగా రావడం జరిగింది.


ఈ సందర్భంగా తన పాత సినిమాలలో నటించినట్లు గాని పాకీజా గొడుగు పట్టుకుని కళ్ళజోడు ధరించి స్టేజి మీదకి రావడం జరిగింది. రాగానే తనదైన కామెడీతో అందరిని నవ్వించడం జరిగింది అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది పాకీజా రీసెంట్లీ తో అటు అభిమానులు నెట్టిజనులు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇలాంటి సమయాలలో సపోర్టుగా నిలిచిన మల్లెమాల టీం కి జబర్దస్త్ టీం కి కూడా పలువురు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: