సోషల్ మీడియా  లో పుకార్లు బాగా ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా అలాగే మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు బాగా పుకార్లు పుట్టించేస్తున్నారు.

ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా మరణించారని రాసేస్తున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం కొంతమంది యూట్యూబర్స్ చిల్లర పనులు అయితే చేస్తున్నారు. ఇక ఈ రూమర్స్ వలన సెలబ్రిటీలు కూడా ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ  బాధితుల లిస్ట్ లో నేను కూడా ఉన్నానని చెప్పుకొచ్చాడు హీరో శ్రీకాంత్. ఫ్యామిలీ హీరోగా ఎన్నో మంచి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, అలాగే విలన్ గా అదరగొడుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ శ్రీకాంత్ ఉన్నాడు అంటే మాములు విషయం కాదు. ఇక గత కొన్నరోజులుగా శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఏ ఇంటర్వ్యూలోనైనా ఈ ప్రశ్న అడగకుండా ఆయనకు ఇంటర్వ్యూ అయితే పూర్తి కాదు. నేడు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్న ఎదురయ్యింది. దీంతో మరోసారి ఈ పుకార్లకు చెక్ పెట్టాడటా శ్రీకాంత్.

” సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో  వారికీ నచ్చినట్లు రాసేస్తారు. అసలు అందులో నిజం ఉందో లేదో కూడా తెలియదు వారికి. కొన్నిసార్లు ఈజీగా తీసుకున్నా ఇంకొన్నిసార్లు మాత్రం చాలా బాధపడుతుంటాను. మరీ దారుణంగా అయితే రాస్తున్నారు. ఒకసారి నేను చనిపోయినట్లు రాసి నా ఫోటో ను పెట్టారు. అది ఇంట్లో వాళ్లు చుస్తే ఎంత ప్రమాదం జరిగేది.. వారికి ఏదైనా కావొచ్చు కదా.ఇలాంటి వార్తలు రాసే వారిని కఠినంగా శిక్షించాలి.నేను ఊహకు విడాకులు ఇస్తున్నట్లు కూడా రాశారు. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పడానికి ఊహను తీసుకొని ప్రతి ఈవెంట్స్ కు వెళ్లాల్సి వచ్చింది. ఫోటోలు కూడా పెట్టాల్సి వచ్చింది. ఊహకు బయటకు రావడం అయితే అసలు ఇష్టం ఉండదు.ఆ సంగతి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఇక నిన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయినట్లు కూడా చెప్పుకొచ్చారు.. అది విని కూడా నేను ఎంతో బాధపడ్డాను” అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: