
రామ్ చరణ్ తన కెరీర్ లో 16 వ మూవీ ని బూచి బాబు సన దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలబడింది. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ మరియు వృద్ధి సినిమాస్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు సంయుక్తంగా రూపొందించబోతున్నాయి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కకబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వం వహించబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందబోయే మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో రామ్ చరణ్ నటించిన బోయే సినిమాకు దర్శకుడు ఎవరు అనేది మాత్రం కన్ఫామ్ కానట్లు తెలుస్తోంది.