కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తమిళనాడులో టాప్ హీరోగా అజిత్ దూసుకుపోతున్నాడు. ఇక అజిత్ కి తమిళ్ లో అందరి హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్స్ వున్నారు. అజిత్ తండ్రి అయిన పీఎస్ మణి ఇటివలే మరణించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమతో మంచి రిలేషన్స్ ఉన్న మణి మరణించడంతో కాలీవుడ్ వర్గాలు ఎంతగానో కలత చెందాయి.కోలీవుడ్ స్టార్స్ హీరోలు ఇంకా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అజిత్ కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నాయి. ఇక తన లియో సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకోగానే అజిత్ ఇంటికి మరో టాప్ హీరో దళపతి విజయ్ వెళ్లి అజిత్ కి కలిశాడు. ఈ అపూర్వ కలయిక ఇలాంటి కష్ట సమయంలో చూడాల్సి వచ్చిందే అని అజిత్-విజయ్ అభిమానులు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.


ఇక ఆ తరువాత స్టార్ హీరోలు సూర్య, కార్తిలు కూడా అజిత్ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. సూర్య, కార్తీ, అజిత్ హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అజిత్ కుమార్ రీసెంట్ గా వలిమై, తునివు సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. ఆ రెండు సినిమాలు తమిళనాడులో బాగా వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచాయి.ప్రస్తుతం తన తదుపరి సినిమా మొదలుపెట్టే పనిలో ఉన్నాడు. సూర్య విషయానికి వస్తే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ పీరియాడిక్ డ్రామా ‘సూర్య 42’ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇక కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టాడు.విజయ్ విషయానికి వస్తే వారిసు సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 67 వ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: