
ఇక ఈ సినిమాలో రఫ్ లుక్ లో కనిపించబోతున్న నాని తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా కు సంబంధించి ప్రమోషన్స్ లో ప్రస్తుతం తెగ బిజీగా మారిపోయాడు నానీ. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాని. ఇప్పటికి తాను శ్రీదేవికి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణక్షణం లో ఆమెను చూడటం.. తనకి ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని నాని తెలిపాడు. మొదటి నుంచి తన జీవితంపై శ్రీదేవి ప్రభావం కాస్త ఎక్కువగానే పడింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే అని చెబుతాను. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈరోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్ది శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దసరా సినిమా గురించి మాట్లాడుతూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా మూవీ లో ధరణి అనే పాత్రలో కనిపించబోతున్న. ఈ పాత్ర నాకు ఎంతో చాలెంజింగ్ అనిపించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30 తేదీన విడుదల చేస్తున్నట్టు నాని చెప్పుకొచ్చాడు.