మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన డాన్స్ తో కూడా ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా సాయి పల్లవి తెలుగు లో విరాట పర్వం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. దగ్గుపాటి రానా హీరోగా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఈ మూవీ కి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి ... అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా ... సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతుంది అని ఒక వార్త బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సాయి పల్లవి పుష్ప పార్ట్ 2 మూవీ లో తన పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ పుష్ప పార్ట్ 2 మూవీ లో తాను నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆ మూవీ లో అవకాశం వచ్చింది అని వార్తలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని కూడా సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: