తమిళ స్టార్  హీరో తలపతి విజయ్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్‌ లియో (Leo.. Bloody Sweet). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లియో టైటిల్‌ గ్లింప్స్ వీడియో నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతూ బాగా హల్ చల్ చేస్తోంది. ఇక ఇటీవలే లియో కశ్మీర్‌ షెడ్యూల్‌ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇంకా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు మేకర్స్‌. ఇక ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం లియో కొత్త షెడ్యూల్‌ ఈరోజు చెన్నైలో షురూ అయింది.తాజా షెడ్యూల్‌ మొత్తం 17 రోజులపాటు కొనసాగనుంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్‌ కోసం విజయ్‌ టీం హైదరాబాద్‌కు రానుందట. లియో ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తలపతి 67గా వస్తున్న లియో సినిమాలో త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ ఇంకా అలాగే సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సినిమాకి యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. లియో సినిమాకి లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు.ఇక లియో సినిమా ఓవర్ సీస్ రైట్స్ చాలా ఎక్కువ మొత్తంలో రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు సమాచారం తెలుస్తుంది.రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ మొత్తంలో రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం తెలుస్తుంది.మాస్టర్ సినిమా తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు చాలా భారీగానే ఉన్నాయి. ఈ సారి విజయ్‌ను స్టన్నింగ్‌ పక్కా మాస్‌ అవతార్‌లో చూపించబోతున్నట్టు టైటిల్‌ గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌. ఈ సంవత్సరం వారిసు సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్‌ అందుకున్నాడు విజయ్‌. ఈ సినిమా తెలుగలో వారసుడు టైటిల్‌తో విడుదలై మిక్స్ డ్‌ టాక్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: