బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ బాలీవుడ్ కండల వీరుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందినటు వంటి గాడ్ ఫాదర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో నయనతార ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సత్య దేవ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. తమన్మూవీ కి సంగీతం అందించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే మూవీ లో హీరో గా నటించాడు.  ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్మూవీ లో ఒక పాటలో గెస్ట్ రోల్ లో కనిపించాడు.

ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం రామ్ చరణ్ కనిపించిన పాటను విడుదల చేయగా ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు  అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: