
బోయపాటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా విజయం ద్వారా రవితేజ కెరియర్ మళ్ళీ ఒక్కసారిగా ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ తో పాటు హీరోయిన్ అన్నయ్యగా చేసిన ప్రకాష్ రాజ్ దీపక్ పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి దీపక్ బాగా సెట్ అయ్యాడు అని అందరూ అనుకున్నారు.
కానీ ముందుగా దర్శకుడు బోయపాటి రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం దీపక్ ను అనుకోలేదట. ఇక ఆ పాత్రలో రాజీవ్ కనకాల అయితే బాగుంటుందని భావించాడట దర్శకుడు బోయపాటి. కానీ అప్పటికే రాజీవ్ కనకాల చాలా సినిమాలతో బిజీబిజీగా ఉండటం వల్ల డేట్స్ కేటాయించలేకపోయాడట. దీంతో ఇక బోయపాటి ఆ పాత్ర కోసం సెకండ్ ఆప్షన్ గా హీరో శివాజీ తో చర్చలు జరిపాడట. కానీ అప్పుడు ఆయన కూడా బిజీ ఉండడంతో నో చెప్పాడట. దీంతో ఇక దీపక్ ను తీసుకువచ్చి ఆయనతో ఈ క్యారెక్టర్ చేయించారు. ఇక ఈ పాత్రతో దీపక్ కి మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.