టాలీవుడ్ స్టార్ హీరో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.ఇక తన తరువాత సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం లో భారీ బడ్జెట్ లో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఆ సినిమా కు సంబంధించిన రెండవ షెడ్యూల్ ని ఈ నెల చివరి వారంలో స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాన్ని షూట్ చేసిన దర్శకుడు కొరటాల శివ రెండవ షెడ్యూల్ లో హీరోయిన్ ఇంకా హీరో పై రొమాంటిక్ సీన్స్ షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో రెండవ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.చాలా స్పీడ్ గా ఈ సినిమా ను పూర్తి చేసి హిందీ సినిమాని మొదలు పెట్టేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు.


కొరటాల శివకు ఇప్పటికే సెప్టెంబర్ నెల వరకు సినిమాను పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. మొన్నటి దాకా అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన షూటింగ్ ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చాలా స్పీడ్ గా పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అందుకే మొదటి షెడ్యూల్ పూర్తయిన రెండు వారాల్లోనే రెండో షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే చాలా రిచ్ గా ఇంకా స్పెషల్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. కాబట్టి ఈ సినిమా మరో భారీ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజమౌళి సినిమా లో నటించి ఆ తర్వాత ఆ హీరో నటించే సినిమా లు ఫ్లాప్ అవుతాయి. అయితే ఈసారి ఎన్టీఆర్ కొరటాల శివ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: