నటి ఖుష్బూకు సోషల్ మీడియా లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామబాణం సినిమాలో ముఖ్య పాత్ర లో ఖుష్బూ నటించగా ఈ సినిమా మే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

గోపీచంద్ మరియు జగపతిబాబు కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖుష్బూ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. 

అమితాబ్ బచ్చన్ అంటే నాకు చాలా అభిమానమని ఆమె తెలిపారు. నా బెడ్ రూమ్ లో అమితాబ్ ఫోటోలు ఇప్పటికీ కూడా ఉంటాయని ఖుష్బూ వెల్లడించారు. బాల్యం లో అమితాబ్ తో నటించానని అయితే పెద్దయ్యాక అమితాబ్ తో నాకు నటించే అవకాశం మాత్రం రాలేదని ఆమె పేర్కొన్నారు. అమితాబ్ టబు కలిసి చీనీకమ్ అనే మూవీలో నటించగా అమితాబ్ తో టబు రొమాన్స్ చేయడంతో ఆమెపై కోపం కూడా వచ్చిందని ఖుష్బూ తెలిపారు. 

అమితాబ్ తో నేను మాత్రమే రొమాన్స్ చేయాలని నువ్వు ఎలా చేస్తావంటూ కూడా తిట్టానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. చిరంజీవి, బాలయ్యతో కలిసి నేను నటించలేదని రాబోయే రోజుల్లో కూడా వాళ్లతో కలిసి నటించే అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తున్నానని ఖుష్బూ తెలిపారట.. అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ గురించి ఖుష్బూ స్పందిస్తూ ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు అస్సలు అర్థం కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఖుష్బు పలు సినిమాలలో నటిస్తూ జబర్దస్త్ వంటి పలు టీవీ షో లకు జడ్జి గా వ్యవహారిస్తున్నారు.

నన్ను, పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులు తల్లీదండ్రులుగా చూడలేకపోయారేమో అని ఖుష్బూ కామెంట్లు చేశారట.నాకు పవన్ కు మధ్య మ్యాజిక్ మిస్ అయ్యి ఉంటుందని ఈ రీజన్ వల్లే ఆ సినిమా ఆడలేదని కూడా ఖుష్బూ తెలిపారు. నటి ఖుష్బూ చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: