ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో డైరెక్టర్ సుకుమార్ దీని సీక్వల్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అంతకుమించి అన్నట్లుగా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.చాలా గ్రాండ్ గా పుష్ప 2 మూవీని ప్లాన్ చేసిన సుకుమార్ ఎన్నో హంగులతో ఈ సినిమాను తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. పలు పెద్ద కంపెనీలు వందల కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.దీంతో అల్లు అర్జున్ రేంజ్ ఏంటనేది మరోసారి తెలుస్తుంది.పుష్ప ఫస్ట్ పార్ట్ తో అటు అల్లు అర్జున్, ఇటు రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. బాలీవుడ్ లో కూడా చాలా పాపులర్ అయ్యారు. అల్లు అర్జున్ మాస్ లుక్‌కి తోడు రష్మిక మందన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర బాలీవుడ్ లో ఆమె క్రేజ్ రెట్టింపు చేసింది.తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ గురించిన అప్ డేట్ బయటకొచ్చింది. ఆడియో రైట్స్ కి భారీ డిమాండ్ రావడంతో ఏకంగా రూ. 65 కోట్లకు విక్రయించినట్లు సమాచారం తెలుస్తుంది.


ఇండియన్ సినిమాలోనే ఇది కనీవినీ ఎరుగని సరికొత్త హిస్టరీ అని చెప్పొచ్చు. దీంతో పుష్ప రాజ్ రికార్డుల వేట ఇప్పటినుండి షురూ అయిందంటూ కాలర్ ఎగరేస్తూ కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట పుష్ప మేకర్స్. పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ మాములుగా ఉండదట.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి బయటకొచ్చిన పలు ఫొటోస్ సినిమాపై బాగా హైప్ పెంచేశాయి. అల్లు అర్జున్ మాస్ లుక్ ప్రేక్షక లోకంలో క్యూరియాసిటీ పెంచేసింది.ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా పక్కా ప్లాన్ చేసిన సుకుమార్.. ఈ పుష్ప 2 సినిమాను కూడా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. ఇంకా అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఏకంగా 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: