
దీంతో అప్పటివరకు సినిమాకు వెళ్లాలి అని నిర్ణయించుకున్న ప్రేక్షకులు.. సైతం నెగిటివ్ టాక్ రావడంతో ఇక ఆలోచన మార్చుకున్నాడు. దీంతో ఇక ఏజెంట్ సినిమా వేస్తున్న థియేటర్లు పూర్తిగా ప్రేక్షకులు లేకుండా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఓపెనింగ్ రోజు నుంచి వసూళ్ల విషయంలో నెగిటివ్ టాక్ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. మొదటి రోజు ట్రేడ్ పరంగా ఏకంగా 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సిన ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూలు చేసుకుంది. ఇక ఆ తర్వాత రెండో రోజు నుంచి ఈ సినిమాకు షేర్స్ రావడం అయితే మరింత గగనంగా మారిపోయింది.
ముఖ్యంగా కమిషన్ బేసిస్ మీద కాకుండా రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న థియేటర్స్ పరిస్థితి అయితే రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. ఇక అఖిల్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఇవి చూసిన అభిమానులు అసలు ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్లలేకపోతున్నారు. ఇక అఖిల్ సినిమా విడుదలై ఇటీవలే వారం పూర్తయింది. ఇక ఎప్పుడు కొత్త సినిమా విడుదలవుతుంద ఎప్పుడు ఈ సినిమాను తీసి పక్కన పెడదామా అని థియేటర్స్ యాజమాన్యాలు కూడా చూస్తూ ఉన్నాయి.
అయితే ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమాకి 7 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా 37 కోట్ల జరిగితే ఏడు కోట్లు మాత్రమే షేర్ రావడంతో 30 కోట్ల రూపాయలు నష్టం వాటిలిందట. ఇంకో విశేషం ఏమిటంటే నైజం లాంటి ప్రాంతాలలో సైతం ఏజెంట్ సినిమా కనీసం విష్ణు నటించిన జిన్నా సినిమా కంటే కూడా ఎక్కువ వసూళ్లు రాబట్ట లేకపోయింది. ఈ విషయం తెలిసి అక్కినేని హీరోలకు నైజాంలో ఇలాంటి పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో అఖిల్ బలమైన హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.