
ఒక్కో సినిమా కు 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి ఆ మొత్తం లో 20 శాతం వరకు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారట.అయితే చిరంజీవి చదువుకునే కాలేజ్ కోసం తాజాగా సాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఈ సంగతి సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతోంది. చిరంజీవి వైఎన్ కాలేజ్ లో చదువుకోగా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం ఆయన ఏకంగా 50 లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం.గతం లో చిరంజీవి ఎంపీగా పని చేశారనే విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంపీ నిధుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం సహాయం చేశారు. ఈ సహాయం ద్వారా చిరంజీవి చదువుకున్న కాలేజ్ రుణం తీర్చుకున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
చిరంజీవి తో పాటు ఆ కాలేజ్ లో చదివిన మరి కొందరు సినీ ప్రముఖులు సైతం ఆ కాలేజ్ కోసం భారీ మొత్తం లో సహాయం చేశారని కూడా సమాచారం అందుతోంది. భవిష్యత్తు లో కాలేజ్ అభివృద్ధికి డబ్బు అవసరమైతే తన సొంత డబ్బును ఇస్తానని మెగాస్టార్ చెప్పారని సమాచారం.. ఈ మధ్య కాలంలో ఇతరులకు సహాయం చేసే మనస్సు ఎక్కువ మందికి ఉండటం లేదని ఆ విషయం లో చిరంజీవి గ్రేట్ అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా కే పరిమితం కాగా కీర్తి సురేష్ డేట్స్ వల్ల ఈ సినిమా కొద్దిగా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది..