
గతంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నారప్ప అనే సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీ గానే గడుపుతుంది ప్రియమణి. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ. ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించింది ప్రియమణి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లొ ప్రేమని కూడా బిజీ బిజీ గానే ఉంది అని చెప్పాలి.
కాగా నాగచైతన్య హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు టేకింగ్ లో తెరకెక్కిన కస్టడీ.. ఈనెల 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాగచైతన్య కనిపించబోతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్. అయితే ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. తన మనసులో మాటను బయట పెట్టేసింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాల్లో నటించాను. కానీ చిరంజీవితో ఒక్క సినిమా చేయలేదు. ఆయనతో ఒక్కసారైనా నటించాలని ఉంది అంటూ ప్రియమణి మనసులో మాట బయట పెట్టింది.