కొన్ని కొన్ని మీడియం రేంజ్ సినిమా లకు కూడా అప్పుడప్పుడు అదిరిపోయే రేంజ్ అంచనాలు ప్రేక్షకు ల్లో ఏర్పడుతూ ఉంటాయి. అలా ప్రేక్షకు ల్లో భారీ అంచనాలు ఏర్పడిన మూవీ లకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడిన కారణంగా ఆ మూవీ నిర్మాతలు కూడా పెట్ట వలసిన దాని కంటే ఎక్కువ బడ్జెట్ ను కేటాయించి ఆ మూవీ లను నిర్మిస్తూ ఉంటారు. అలా నిర్మించిన సందర్భాలలో ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు అయినట్లు అయితే ఆ సినిమాల ద్వారా నిర్మాతలకు భారీ నష్టాలు వస్తుంటాయి. అలా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన టాప్ 5 మీడియం రేంజ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

విజయ్ దేవర కొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా ద్వారా నిర్మాత లకు 60 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ద్వారా నిర్మాతలకు 30 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వం లో రూపొందిన అఖిల్ మూవీ ద్వారా నిర్మాతలకు 26 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వం లో రూపొందిన ఇంటిలిజెంట్ మూవీ ద్వారా నిర్మాతలకు 24 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది . విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ద్వారా నిర్మాతలకు 21 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: