నందమూరి బాలకృష్ణ  హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరి కొత్త మూవీ ''NBK108''.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుందని తెలుస్తుంది... మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ కూడా బయటకు వచ్చింది.. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది.. ఇక తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ భాగం అయ్యాడు అంటూ మేకర్స్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ను తీసుకున్నట్టు మేకర్స్ చెబుతూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారట... ఈ సినిమాతో ఈ బాలీవుడ్ స్టార్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.. దీని గురించి కూడా ఇంట్రెస్టింగ్ వీడియో ను రిలీజ్ చేసారు.. దీంతో ఈసినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా బాగా పెరిగి పోతుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారట... అలాగే ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవ్వనుంది.. మరి అనిల్-బాలయ్య ఇద్దరు కూడా ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉండడంతో మరో హిట్ బాలయ్య ఖాతాలో ఖాయం అంటున్నారు. ఫ్యాన్స్…

మరింత సమాచారం తెలుసుకోండి: