పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'ఆది పురుష్' ఆరంభము నుంచే వరుస వివాదాలను ఎదుర్కొంటుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని విమర్శల మధ్య లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది అనుకునే లోపే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా 'ఆదిపురుష్'సినిమాపై సెన్సార్ బోర్డులో ఓ ఫిర్యాదు నమోదయింది. ఈ సినిమాను విడుదల చేసే ముందు తాము కూడా చూడాల్సిన అవసరం ఉందంటూ చెబుతున్నారు సనాతన ప్రచార కర్తలు. 

సనాతన ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాధ తివారి బాంబే హైకోర్టులో ఆశిష్ రాయి, పంకజ్ మిశ్రా అనే లాయర్ల ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేసే ముందు స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దానికి సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది పురుష్ చిత్ర యూనిట్ గతంలో ఆర్టిస్టులు, పోస్టర్ల విషయంలో చాలా తప్పులు చేశారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ అవి సినిమాలో కనుక ఉంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని, దానివల్ల శాంతి భద్రతల ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఫిర్యాదుతో ఆది పురుష్ టీం కి రిలీజ్ కు ముందు ఈ  ఇబ్బంది ఏర్పడడం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ వివాదం సర్దుమణగకపోతే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. మరి సనాతన ధర్మ ప్రచారకర్తలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు రిలీజ్ కు ముందు ఆది పురుష్ స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేస్తారా? లేక వాళ్లకు సమాధానం చెప్తారా? అనేది చూడాలి. ఇక ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. టి సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: