
కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య చేసిన బైలింవల్ మూవీ కస్టడీ.. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్ గా అరవిందస్వామి నటించారు. ఇందులో కీలకమైన పాత్రలు ప్రియమణి కూడా నటించింది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.. దాదాపుగా రూ.21.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.22.50 కోట్లకు క్లోజ్ గా ఉండడంతో ఈసారి చైతన్య ప్రొడ్యూసర్ జేబులో నియమింపడం ఖాయమని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
దీనికి తోడు తాజాగా విడుదలైన ఈ సినిమా డిసెంట్ టాకుతోనే రన్ అవుతుంది ఇక భారీగానే ఓపెనింగ్స్ వచ్చేలా ఉండడంతో ఈ లెక్కన చూస్తే ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ ఖుషి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థాంక్యూ సినిమా గోరమైన డిజాస్టర్ తర్వాత నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాతో ఏ మేరకు కలెక్షన్లు రాబడతారో చూడాలి మరి. నాగచైతన్య ఈమధ్య కాలంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి చిత్రంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.