సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చేయకూడని పని చేస్తే మాత్రం అస్సలు వదలరు. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు  కొన్ని చెత్త పనులు చేస్తూ మీడియా దృష్టిలో పడ్డారు. అయితే రీసెంట్ గా రష్మిక మందన్న కూడా అటువంటి పని చేస్తూ దొరికిపోయిందట.దీంతో నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారట..

టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక  గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు లో అడుగుపెట్టి.. ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని తన నటనకు గాను ఓ ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంది. ప్రస్తుత సినీ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది.ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత ఆ పై వచ్చిన అంజనిపుత్ర మరియు డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది. టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ ను పొందింది. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ.. ఇండియన్ క్రష్ గా ఓ ఊపు ఊపుతుంది. గత ఏడాది వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో వేరే లెవెల్ లో మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత ఎక్కువగా పెరిగింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో వుంది.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లిస్టులో రష్మిక కూడా ఒకరట.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడ్వర్టైజ్మెంట్లు కూడా ఆమె చేస్తూ ఉంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. ఈమెకు బాగా ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అయితే రీసెంట్ గా రష్మిక నాన్ వెజ్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. నిజానికి రష్మిక వెజిటేరియన్. తను ఈ విషయం గతంలోనే తెలిపిందట.. దీంతో నాన్ వెజిటేరియన్ యాడ్ లో నటించడంతో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారట నెటిజన్స్. వెజిటేరియన్ అని చెప్పి నువ్వు నాన్ వెజ్ తినడం అస్సలు కరెక్టేనా.. నువ్వు వెజిటేరియన్ అయ్యి ఉండి ఇలాంటి యాడ్ ఎలా చేయగలిగావు అంటూ బాగా ఫైర్ అవుతున్నారు నెటిజన్స్ . మరికొంతమంది విజయ్ దేవరకొండ అలవాటు చేసాడేమో అని కామెంట్స్ కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: