
మళ్లీ హీరోయిన్గా సత్తా చాటాలని కాజోల్ అగర్వాల్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాలయ్యతో ఒక సినిమా నటిస్తూనే భారతీయుడు-2 చిత్రంలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ లో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఈమెను నిర్మాతలు కాదనేలా చేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాజల్ మాత్రం తన రూటు మార్చి ఫిమేల్ సెంట్రల్ సినిమాలలో నటించేలా ప్లాన్ చేస్తోంది. స్టార్ హీరోల కమర్షియల్ చిత్రాలలో ఆఫర్లు లేకపోయినా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
కాజల్ అగర్వాల్ ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్న ఈమె తో జతకట్టేందుకు స్టార్స్ సైతం ఎవరు ముందుకు రాకపోవడంతో ఆఫర్లు తగ్గాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకప్పటిలా పెళ్లైన హీరోయిన్స్ సత్తా చాటలేరన్న సెంటిమెంట్ కాజల్ అగర్వాల్ బ్రేక్ చేసి ఈ మధ్య ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదరగొట్టేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు వారి లిస్టులో చేరిపోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోగా వెరైటీ కథనాలతో తన ట్యాలెంట్ నిరూపించుకోవాలని చూస్తోంది ఈ అమ్మడు మరి ఒకప్పటి ఫామ్ తెచ్చుకునేందుకు సపోర్టు ఈ సినిమా కథలు చేస్తాయా లేదా అన్న విషయం చూడాలి మరి.