
కస్టడీ డిజాస్టర్ కావడంతో నాగచైతన్య డీల పడిపోగా డైరెక్టర్ వెంకట ప్రభు మాత్రం తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి ప్లాన్ చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తనకు ఎంతో నచ్చిన స్టార్ హీరోలు అజిత్ కుమార్ విజయ్ దళపతి కోసం రెండు వేరు వేరు కథలను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాళ్లతో సినిమా చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం వెంకట ప్రభువు ఇళయ దళపతి విజయ్తో కధపరమైన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అధికారికంగా కూడా ప్రకటన త్వరలోనే వెలుబడనుంది.. ఇదంతా ఇలా ఉండగా ఇలా దళపతి విజయ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమాని తెలకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ వెంకట ప్రభువుతో సినిమా మొదలుపెట్టి అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.