
ఇక ఈ సినిమాలో నాగచైతన్య శివ అనే కానిస్టేబుల్ పాత్రలో నటించాడు అని చెప్పాలి. మే 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు అటు అక్కినేని అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి కస్టడీ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలి అనుకున్నా అది కుదరలేదు. అయితే ఈ సినిమాలో మొదటి ఆప్షన్ మాత్రం కృతి శెట్టి కాదట. కస్టడీ మూవీ ఆఫర్ ముందుగా వేరే స్టార్ హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట.
కానీ కస్టడీ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆ హీరోయిన్ ముందుగానే ఊహించి.. ఇక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కస్టడీ సినిమాలో మొదట దర్శకుడు వెంకట్ ప్రభు రష్మికను చైతన్యకు జోడిగా తీసుకోవాలని అనుకున్నాడట. రష్మిక తో సంప్రదింపులు కూడా జరిపాడట. అయితే కస్టడీ కథ విన్న తర్వాత హీరోయిన్ స్క్రీన్ స్పేస్ బాగానే ఉన్నా.. ఇక ఈ సినిమా స్టోరీ మీద మాత్రం ఆమెకు నమ్మకం రాలేదట. దీంతో ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ కృతి శెట్టి కి వెళ్ళింది. ఈ సినిమా చేసిన కృతి మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకుంది.