
ఏజెంట్ సినిమా ఫ్లాప్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మార్కెట్ లేని హీరో మీద అంత బడ్జెట్ పెట్టి భారీ డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ డైరెక్టర్ని నిర్మాతను కూడా ట్రోల్ చేయడం జరిగింది ప్రేక్షకులు.. నిర్మాత అనిల్ సుంకర్ ఏజెంట్ ప్లాప్ అని ఒప్పుకుంటూ ఒక ప్రెస్ నోట్ ని కూడా గతంలో విడుదల చేశారు.తాజాగా అఖిల్ కూడా ఏజెంట్ సినిమా ప్లాప్ పైన మొదటిసారి స్పందిస్తూ.. ఏజెంట్ ప్లాప్ పై ఒక స్పెషల్ నోటు కూడా రాయడం జరిగింది. ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది..
ఈ నోట్లో ఏజెంట్ సినిమాకు ప్రాణం పోయడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన నటీనటులకు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదములు మేము మా స్థాయిలో చాలా బాగా అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం.. కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నట్టు తెరపైన మెప్పించలేకపోయాం మీకోసం మేము మంచి సినిమాలు అందించలేకపోయాము నాకు చాలా సపోర్ట్ చేసిన నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నాపై మా సినిమాపై నమ్మకం ఉంచి డిస్టిబూటర్స్ మాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు.. మీరు చూపించిన ప్రేమ శక్తి నన్ను ఇంకా పని చేసేలా చేస్తున్నాయి నన్ను నమ్మిన వారి కోసం నేను మరింత బలంగా తిరిగి వస్తానంటూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు.