విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమా క్రిస్ మస్ బరిలో రిలీజ్ అవుతుంది. మెడికల్ మాఫియా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా గురించి ఎక్కువ అప్డేట్స్ బయటకు రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందట. దీనిపై ఎలాంటి క్లూస్ లేకుండా సైంధవ్ ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

సైంధవ్ సినిమా విషయంలో వెంకటేష్ చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెంకటేష్ ఇదివరకు గణేష్ సినిమా చేశాడు. అది కూడా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. అదీగాక వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న యాక్షన్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. సైంధవ్ సినిమా ఈ క్రమంలో దగ్గుబాటి ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు.

వెంకటేష్ ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో వింటేజ్ వెంకీని పరిచయం చేసినా సైంధవ్ తో మాత్రం సత్తా చాటాలని చూస్తున్నాడు. వెంకటేష్ సైంధవ్ మాత్రం కమర్షియల్ గా భారీగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ లాండ్ మార్క్ సినిమా 75వ ప్రాజెక్ట్ గా సైంధవ్ వస్తుంది. ఈ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నడు వెంకటేష్.

క్రిస్ మస్ రేసులో వెంకటేష్ సత్తా చాటుతాడా.. శైలేష్ కొలను వెంకీ మామతో అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. వెంకటేష్సినిమా తర్వాత తౌణ్ భాస్కర్, త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలతో వెంకటేష్ అదరగొట్టేయడం పక్కా అని తెలుస్తుంది. సీనియర్ హీరోల్లో వెంకటేష్ కూడా సూపర్ ఫాం లో ఉన్నాడు. ఈ సినిమాలతో వెంకీ మీమ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: