
దీంతో ఇప్పుడిప్పుడే ఈ సినిమా పైన పాజిటివ్ వైస్ ఏర్పడుతున్నాయి. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి మొదటిసారిగా ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ తో ఇలాంటి సినిమా చేస్తున్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్లో మరింత క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంత అనే విషయం బయటకు రావడం జరిగింది.. ప్రభాస్ నటించిన గత చిత్రాలలో సాహో 172 నిమిషాలు ఉండగా.. రాధే శ్యామ్ 138 నిమిషాలు ఉన్నది .ఇప్పుడు ఆది పురష్ సినిమా 174 నిమిషాలు ఉన్నది.. మరి ఇంత పెద్ద సినిమా అని అభిమానులు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి ముఖ్యంగా ఈ సినిమా రామాయణం కథ అంశంతో ఉంది కాబట్టి ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని అభిమానులు భావిస్తున్నారు . అభిమానుల అంచనాలను ఏ మేరకు ఆది పురుష్ చిత్రం అందుకుంటుందో చూడాలి మరి. ఈ ఏడాదైనా వరుసగా సినిమాలతో అభిమానులను మెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రభాస్.