యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన నటన గురించి.. క్రేజ్ గురించి.. వరుస సినిమాల అనౌన్స్మెంట్ గురించి.. అబ్బో ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా సినిమాలను ప్రకటిస్తూ షూటింగ్లలో కూడా శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఈయన.. ఈ సినిమాలోని నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డు కూడా లభించింది.. దీంతో ఎన్టీఆర్ కి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ లభించింది అని చెప్పాలి.

దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమాకే తన సమయాన్ని కేటాయించిన ఆయనకు మంచి ప్రతిఫలం లభించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఆయన తదుపరి చిత్రం కూడా అంతే రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకున్నారు.  అందుకు తగ్గట్టుగానే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరొక హీరోయిన్ గా సాయి పల్లవి కూడా ఎంపిక అయ్యారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగానే ఆయన తన తదుపరిచిత్రాన్ని ఎప్పుడు మొదలుపెడతారు అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఇక ఈ సినిమాకి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న సినిమాలు అంతకుమించి క్రేజ్ అందిస్తాయని నమ్మకంతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.  మరి ఈ చిత్రాలు ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో.. ఇకపోతే ఎన్టీఆర్ 31 మూవీ అప్డేట్ విని అభిమానులు  సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: