
ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ సినిమా అటు తమిళ్లో ఇటు తెలుగులో కూడా మెప్పించలేకపోయింది అని చెప్పాలి. ఒకరకంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే కస్టడీ లాంటి ఇబ్బందికర ఫలితం తర్వాత సాధారణంగా ఏ డైరెక్టర్ కైనా సరే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ అటు వెంకట్ ప్రభు మాత్రం ఒక స్టార్ హీరో సినిమా ఆఫర్ ని పట్టేశాడు అని తెలుస్తుంది. సాధారణంగా అయితే వెంకట్ ప్రభు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమా అని అందరూ భావిస్తూ ఉంటారు.కానీ కస్టడీ సినిమా విషయంలో మాత్రం వెంకట్ ప్రభు కాలిక్యులేషన్స్ ఎక్కడో మిస్ అయినట్లు అర్థమైంది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా వెంకట్ ప్రభువు ప్రతిభ పై నమ్మకం ఉంచిన ఒక స్టార్ హీరో ఇక తన సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఛాన్స్ ఇచ్చాడట. ఇలా కస్టడీ ప్లాప్ తర్వాత చాన్స్ ఇచ్చిన హీరో ఎవరో కాదు దళపతి విజయ్. వారసుడు అనే సినిమాతో ఈ సంక్రాంతికి హిట్టు కొట్టిన విజయ్.. ఇప్పుడు లోకేష్ కనకరాజు తో లియో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు తోనే విజయ్ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తోంది. అయితే స్టార్ హీరోలతో అయినా సరే ప్రయోగాలకు వెనకాడని వెంకట్ ప్రభు.. ఇక ఇప్పుడు దళపతి విజయ్ తో ఎలాంటి సినిమా చేస్తాడు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.