మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు.

ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సమ్మిట్ లో చరణ్ ఎంతో యాక్టివ్ గా కనిపించాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదరగొట్టాడు. అంతేకాకుండా స్టేజి మీద ఆర్ఆర్ఆర్ స్టెప్పులు వేసి కనువిందు చేశాడు. ఇక ఇండియా గర్వించదగేలా చరణ్ స్పీచ్ అల్టిమేట్ అని చెప్పాలి. కాగా, ఈ స్పీచ్ లో చరణ్.. తన తండ్రి చిరు గురించి చెప్తూ ఆయన చేస్తున్న సినిమాల గురించి నోరు జారాడు. ఇప్పటివరకు చిరంజీవి భోళా శంకర్ సినిమా ఒక్కటే చేస్తున్నారు. అది ఫినిష్ అయ్యాక కుర్ర డైరెక్టర్లతో చిరు సినిమాలు ఉంటాయని టాక్ నడుస్తుంది కానీ, కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు చరణ్ చెప్పిన దాంతో కన్ఫర్మేషన్ వచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ సమ్మిట్ లో చరణ్ మాట్లాడుతూ.. ” మా నాన్నగారు ఏజ్ 68. ఇప్పటికీ ఆయన 5.30 కు లేస్తారు. ఆయన దగ్గరనుంచే ఆ క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆయన ఒక్క సినిమాకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నేను చూశాను. ఆయన కష్టపడేతత్వం నాకు అలవడింది. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఆయన ఒకరు..ఎప్పటికీ మా నాన్నగారే నాకు స్ఫూర్తి” అని చెప్పుకొచ్చాడు. ఇక నాలుగు సినిమాలు అనగానే మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఆ నాలుగు సీనియాల దర్శకులు ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటికే చిరు.. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ కథలను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా మరో రెండు సినిమాలు ఎవరితో ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: