నటి పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఏదో ఒక వార్తను వస్తూనే ఉంటాయి. ఇక వారిద్దరికీ సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా చాలాకాలంగా పవిత్ర మరియు నరేష్ వ్యవహారం సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలో సైతం హాట్ టాపిక్ గా మారింది.  వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమాలో కూడా నటించారు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమా మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ మరియు పవిత్ర ఇద్దరూ కలిసి వరుసగా ఇంటర్వ్యూలో వేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలలో భాగంగా సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే నటి పవిత్ర నరేష్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ లో చేసింది. దాంతో పవిత్ర చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ నరేష్ ఆస్తి చూసి పవిత్ర నరేష్ ని ఇష్టపడిందని చాలా రకాల వార్తలు వచ్చాయి ..కానీ వాటిలో ఎటువంటి నిజం లేదు.. ఇక ఆ వార్తలను సైతం కొట్టి పారేశారు..

 వారిద్దరు పవిత్ర బంధం అని కూడా అప్పట్లో పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు.ఇక ఈ విషయంపై నటి పవిత్ర సైతం స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందో తెలియజేసింది నటి పవిత్ర. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేష్ తనకు కేవలం లైఫ్ పార్టనర్ మాత్రమే కాదని ఒక సపోర్ట్ సిస్టం అని తెలియజేసింది ఆమె.. ఏ విషయంలోనైనా తనను ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఆమె గురించి సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చిన సరే నరేష్ ఆమెకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ అండగా నిలిచారని ఈ సందర్భంగా చెప్పింది.. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది అంటూ వారి రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది పవిత్ర.. దీంతో పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: