తెలుగు సినీ హీరోయిన్ డింపుల్ హాయతి, తెలంగాణ పోలీస్ అధికారి రాహుల్ హెగ్గే మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. అయితే ఈ వివాదంలో రెండు వైపుల నుంచి విభిన్న కథనాలు వెలువడుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న జర్నలిస్టు కాలనీలో హుడా ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకొన్న ఈ వివాదం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

జర్నలిస్టు కాలనీలో హుడా ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్ అనే వ్యక్తితో హీరోయిన్ డింపుల్ హయతి కలిసి ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య కారు పార్కింగ్ విషయంలో గొడవలు చేసుకొన్నాయి. ఆ గొడవలు సద్దుమణగకపోవడంతో డింపుల్ హయతిపై రాహుల్ కేసు నమోదు చేయడం వివాదంగా మారింది.

అయితే ట్రాఫిక్ డీసీపీ తనపై కేసు నమోదు చేయడంపై డింపుల్ హయతి తన సోషల్ మీడియా లో స్పందించారు. అధికారం చేతిలో ఉంది కదా అని తప్పులు చేయకూడదు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తప్పులను దాచలేరు అంటూ డింపుల్ హయతి వరుస పోస్ట్లు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే డింపుల్ హయతిపై కేసు విషయంలో రాహుల్ హెగ్డే స్పందించారు. నేను పార్కింగ్ చేసే ప్లేస్‌లో డింపుల్ కారు అడ్డంగా పెట్టింది. దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. నా వాహనాన్ని ఢీ కొట్టి కాలుతో తన్నింది. నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దాంతో నా డ్రైవర్ చేతన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని రాహుల్ హెగ్డే చెప్పారు.

డింపుల్ హయతి చేసిన పోస్ట్లపై రాహుల్ స్పందించారు. నేను అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పును కప్పిపుచ్చినట్టు చేసిన పోస్ట్ లో వాస్తవం లేదు. నాకు డింపుల్‌కు వ్యక్తిగతంగా గొడవలేమీ లేదు. ఆమె చేసిన పోస్ట్ ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటో పోలీసుల విచారణలో బయటపడుతాయి అని రాహుల్  చెప్పారు.

అయితే హీరోయిన్‌ డింపుల్‌ హయతీపై కేసులో మీడియా కథనాలు మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డీసీపీ రాహుల్, డింపుల్ మధ్య పార్కింగ్ విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. గతవారం రోజులుగా ఆమె కారుపై ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: