ప్రపంచంలో బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు అంటే కొరియన్ సినిమాలు అని అందరూ చెబుతుంటారు. మన దర్శకులు అక్కడి కథలను నేరుగా, స్ఫూర్తి పేరుతోనే ఇక్కడకు తీసుకొచ్చారు. వాటిలో చాలా వాటికి మనం మంచి మార్కులేసి, విజయాలు కూడా అందించాం.అలాంటి కొరియన్ ఇండస్ట్రీ మన సినిమాను తీసుకొని వెళ్తుంది. ఇది పెద్ద విషయమే మన దేశంలో ఇటీవల కాలంలో తెరకెక్కిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ‘దృశ్యం’అని చెప్పవచ్చు.

ఇప్పుడు ఆ సినిమాలే అక్కడకు వెళ్తున్నాయటా.. మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ అద్భుతం ‘దృశ్యం’. మోహన్‌లాల్‌తో కలసి ఆయన చేసిన ఆ సినిమా ఎంతగా నచ్చేసిందంటే దేశంలో చాలా భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేశారటా.. అలా మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించింది ‘దృశ్యం’. ఇప్పుడు ఈ సినిమాను దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో  కలిసి, పనోరమా స్టూడియోస్ కొరియన్ భాషలో రీమేక్ చేయనుందని సమాచారం.. ఈ మేరకు సినిమా వివరాల్ని ఇటీవల సినిమా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ‘దృశ్యం’ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు కూడా రాబోయే మూడో సినిమా కూడా కొరియన్ భాషలో రీమేక్ అవుతుందని సమాచారం. కొరియన్ ‘దృశ్యం’లో ‘పారసైట్’ సినిమా ఫేం సాంగ్ కాంగ్ హో కథానాయకుడిగా నటిస్తున్నాడటా.. ‘కోబ్ వెబ్’ దర్శకుడు కిమ్ జీ వోన్  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది..మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని కూడా టీమ్ తెలిపింది.అయితే ఈ సినిమాను మలయాళం నుండి కాకుండా హిందీ నుండి తీసుకెళ్తున్నట్లు అయితే చెబుతున్నారు. పనోరమా స్టూడియోస్ అజయ్ దేవగణ్‌కు చెందినదనే సంగతి మీకు తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ కూడా హిందీ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోంది అని ప్రకటించారు. దీంతో మూలం నుండి కాకుండా హిందీ నుండి సినిమా తీసుకెళ్లడం ఏంటో అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: