
అలా వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డుల ను కూడా తిరగరాసింది. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయిక లో నాలుగో సినిమా రాబోతున్నట్లు నిర్మాత బన్నీ వాస్ అయితే ప్రకటించారు.
2018 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్శ్యూలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీపై బన్నీవాస్ ఆసక్తికర కామెంట్స్ కూడా చేశాడు. పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఆయన ప్రకటించారు. 2024లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని బన్నీవాస్ పేర్కొన్నాడటా.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్నట్లు ఆయన వెల్లడించాడు.
ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.బన్నీవాస్ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ కూడా నెలకొంది.
అల్లు అర్జున్ హీరోగా నటించనున్న 22వ మూవీ ఇదే అని ప్రచారం కూడా జరుగుతోంది. . ప్రస్తుతం పుష్ప -2 షూటింగ్‌తో అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోందటా..
పుష్ప పార్ట్ వన్ పెద్ద విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియన్ లెవల్‌లో సినీ అభిమానులు ఎదురుచూస్తూన్నారు. ఈ సీక్వెల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు.. పుష్ప -2 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.పుష్ప సినిమా మాదిరిగా ఈ సారి భారీ విజయం అందుకోవాలని సుకుమార్ చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయితే సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు.