బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వుంది..

ఇలా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఊర్వశి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోని స్పెషల్ సాంగ్ ద్వారా బాగా సందడి చేశారు.

అదేవిధంగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా మెరిసారు. ఇలా ఈ పాటలు ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా హీరో రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడటా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని సమాచారం.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీ లీలా నటించబోతున్నారు. సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఊర్వశి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని కూడా తెలుస్తుంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఈమె ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా ఒక పాటకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలి..హీరో రామ్ వారియర్ సినిమా తో డిలా పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన వారియర్ సినిమా నిరాశ పరిచింది. ఈ సారి ఎలాగైనా మంచి విజయం సాధించాలని బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు.మరీ ఈ సినిమా తో అయిన హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: