ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా కాశ్మీర్లో జరిగిన జి20 సమ్మిట్ కు ప్రతినిధిగా హాజరై భారతీయ సినిమా మరొకసారి గర్వపడేలా చేశారు రామ్ చరణ్.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ సదస్సులో రామ్ చరణ్ మాటలకు అక్కడ అభిమానులే కాదు భారతీయులంతా కూడా ఫిదా అవుతున్నారు. ఆయన స్పీచ్ కి,  ఆయన సింప్లిసిటీ కి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇదే వేదికపై రామ్ చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికర కామెంట్ చేయడం గమనార్హం. ఇకపోతే జి20 సదస్సులో పాల్గొని మాట్లాడిన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ ది ఇండియాగా అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు తన భార్య ప్రెగ్నెన్సీ పై కూడా మాట్లాడిన ఈయన జపాన్తో తమకున్న అనుబంధం గురించి కూడా వెల్లడించారు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నప్పుడే తన భార్య జపాన్లో గర్భం దాల్చింది అని ఇక అక్కడి సంస్కృతులు, అక్కడి ప్రజలు, అలవాటులు తమకు బాగా నచ్చాయి అని , స్వతహాగా తమకు యూరప్ అంటే చాలా ఇష్టం అని కానీ ఈ మ్యాజిక్ తో తమకు జపాన్ అంటే కూడా ఇష్టం పెరిగిపోయింది అంటూ తెలిపారు రామ్ చరణ్. ఇకపోతే ఉపాసన కూడా పిల్లల విషయం పై తమ అనుభవాలను అనుభూతులను పంచుకున్న విషయం తెలిసిందే.ఈ పదేళ్లలో తమను ఎంతమంది ఎన్ని విధాలుగా మాటలతో ఇబ్బంది పెట్టినా..తామెప్పుడూ కూడా భయపడలేదు అని ప్రతిక్షణం తమ బంధం మరింత బలంగా మారింది అంటూ ఆమె కూడా చెప్పుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: