ప్రస్తుతం ప్రభాస్ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రభాస్ పై ఈ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించ బోతున్నారు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన మాలవికా మోహన్ ... రిద్ది కుమార్ ... నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ లో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి మరియు సంజయ్ దత్ కి మధ్య చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు అంతలా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఇందులో సంజయ్ దత్ ను ఈ మూవీ బృందం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంగీత దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఈ మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. మధ్యలో కొంత కాలం ఈ మూవీ కి తమన్ సంగీతం అందించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ చిత్ర బృందం ఈ వార్తలను ఖండించలేదు ... అలా అని ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నట్లు ... ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం నటించినటువంటి డార్లింగ్ ... బుజ్జిగాడు స్టైల్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: