టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పెద్ద ఆనే తేడా లేకుండా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాకైనా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఓటీటి లలో కూడా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా నిన్నటి రోజున బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన చిత్రాలలో ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


నిన్నటి రోజున విడుదలైన చిత్రాలలో చిన్న సినిమాలన్నీ ఎక్కువగా విడుదలయ్యాయి.. అందులో మేము ఫేమస్ సినిమా కూడా ఒకటి ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ని అట్రాక్షన్ చేసే విధంగా ఉండడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీకై నరేష్ పవిత్ర లోకేష్ జంటగా కలిసి నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత విడుదలైన డబ్బింగ్ చిత్రం 2018 ఈ చిత్రం కేరళలోని 2018 లో వచ్చిన వరదలు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని విషయాన్ని చూపించడం జరిగింది.ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ మూడింటిలో మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా 2018 సినిమా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీకెండ్ పరంగా ఇదే ట్రెండ్ కొనసాగితే సేమ్ రిజల్ట్స్ ఉంటాయని వార్తలు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు ఏయే చిత్రాలు ఎంత కలెక్షన్ రాబడతాయో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఓటీటి లలో కూడా విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వారం మాత్రం అన్నీ కూడా థియేటర్లో చిన్న సినిమాలు విడుదలవడం జరిగింది దీంతో అన్ని సినిమాలకు కూడా బాగానే కలిసి వస్తుందని సినీ ప్రేక్షకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: