
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ జంట ఎన్నో ఇంటర్వ్యూలకు కూడా హాజరు కావడం జరిగింది.మళ్లీ పెళ్లి సినిమా ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్ కు ఇండస్ట్రీలో ప్రస్తుతం అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇలా అవకాశాలు రావడంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా పవిత్ర లోకేష్ ఒక్కరోజు కాల్షిప్ ఛార్జ్ చూసి నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయేలా ఉన్నట్లు తెలుస్తోంది.
పవిత్ర లోకేష్ ఒక్కరోజు కాల్ సీటు కోసం దాదాపుగా రూ 60 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఎప్పుడైతే నరేష్ వ్యవహారం వల్ల ఫేమస్ అయ్యిందో రోజుకి లక్ష రూపాయలు వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంలో రెమ్యూనరేషన్ పెంచేయడంతో నిర్మాతలకు సైతం ఈ విషయం కాస్త షాకింగ్ గా అనిపిస్తోంది. ఇదంతా పవిత్ర లోకేష్ ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత ఇచ్చి నిర్మాతలు సైతం తమ సినిమాలో నటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి మరి. మరి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు