పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న క్రమంలో ఆయన సినిమాల కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు ముఖ్యంగా ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి సెన్స్నేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ ప్రారంభం చేసుకోవాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై మొదటి షెడ్యూల్ పూర్తయింది. 

కేవలం 15 రోజులు మాత్రమే జరుపుకున్నా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు మొదటి షెడ్యూల్ కి సంబంధించిన  వర్క్ ని పూర్తి చేసి ఇటీవలే ఒక గ్లిమ్స్ వీడియోని సైతం విడుదల చేశారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్  యాటిట్యూడ్ స్టైల్ తో అలరించాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ యాంగిల్ ని కేవలం పది రోజుల్లోనే బయటకు తీశాడు హరిశంకర్. అలాంటిది ఈ సినిమా  ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ని దీనికంటే గొప్పగా ఎవరు చూపించలేరని ఈ చిన్న గ్లిమ్ప్స్  వీడియోతో ప్రూఫ్ చేశాడు హరీష్ శంకర్.

అయితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూలు వచే నెల 26వ తేదీ నుండి స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ కి సంబంధించిన సెట్స్ వర్క్ కూడా ఇటీవల పూర్తి చేశారట. ఒక స్కూల్ మరియు చుట్టుపక్కల ఉండే పోలీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు పవన్ కళ్యాణ్ వాడే జీపు కూడా ఈ సెట్స్ లో ఉన్నాయట. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం 26వ తేదీన ఒక అదిరిపోయే మాస్ పోస్టర్ని కూడా విడుదల చేయబోతున్నారంట చిత్ర బృందం. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం .దీంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: