నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించామని నరేష్ చెబుతున్నా ఈ సినిమా ప్రొడక్షన్ విలువలు మాత్రం ఆ స్థాయిలో అస్సలు లేవు.

నరేష్, పవిత్ర తాము మంచివాళ్లమని నిజ జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్లే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని తమ గురించి తప్పుగా అనుకోవద్దని చెప్పడం కోసం ఈ సినిమా తీశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఎమ్మెస్ రాజు దర్శకుడిగా కూడా పలు సినిమాలతో విజయాలను అందుకున్నారు. అయితే మళ్లీ పెళ్లి సినిమాలో మాత్రం అభిమానులు కోరుకునే అంశాలు అయితే లేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే పవిత్ర లోకేశ్ తో పెళ్లి, పిల్లల గురించి నరేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

పవిత్రా లోకేశ్ పిల్లల్ని కనడంలో ఎలాంటి తప్పు లేదనే విధంగా స్పందించగా నరేష్ మాట్లాడుతూ తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని కామెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నరేష్ పేర్కొన్నారు. తన దృష్టిలో బ్లడ్ రిలేషన్ షిప్ తో పోల్చి చూస్తే ఎమోషనల్ రిలేషన్ షిప్ అనేది ముఖ్యమని నరేష్ వెల్లడించారు. విజయనిర్మలకు, పవిత్ర లోకేశ్ కు పోలికలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన తల్లి కళ్లు, పవిత్రా లోకేశ్ కళ్లు ఒకే విధంగా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడుపుతామని నరేష్ అన్నారు. నరేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర, నరేష్ పిల్లల్ని కనాలని భావిస్తున్నారని వాళ్ల కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కపుల్ గా నరేష్, పవిత్ర లోకేశ్ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: