మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా యొక్క విజువల్స్ అద్భుతంగా ఉంటాయి అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
సినిమా లో అప్పట్లో గజ దొంగ గా పేరు పడ్డ నాగేశ్వరరావు కథ ను చెప్పబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక బయోపిక్. ఈ మధ్య కాలంలో బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది.

అందుకే ఈ సినిమా ను రవితేజ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు.. హీరోలు మరియు క్రీడా రంగానికి చెందిన వారి యొక్క బయోపిక్ లు మాత్రమే విడుదల అయ్యాయి. వాటికి సంబంధించిన ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టైగర్ నాగేశ్వరరావు లో కూడా ఒక అద్భుతమైన కథ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మెయిన్ లైన్ ను తీసుకుని స్క్రీన్ ప్లే ను ఎక్కువగా మార్చబోతున్నారు. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా యొక్క బడ్జెట్ ను మొదట రూ. 30 కోట్లు అనుకున్నారు. అయితే సినిమా పై ఉన్న అంచనాలు మరియు ఇతర విషయాల కారణంగా భారీగా పెరిగి పోయింది. భారీ ఎత్తున ఈ సినిమా కు ఖర్చు చేయడం జరిగిందట. అంతే కాకుండా ఈ సినిమా కు ఇప్పటికే దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు యొక్క బడ్జెట్ శృతి మించిందని... పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి బ్రేక్ ఈవెన్ మాత్రమే కాకుండా వంద కోట్లు వసూళ్లు చేస్తుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్న నేపథ్యం లో ఎంత వరకు ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: