చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినీ పరిశ్రమని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు .. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఫెడవుట్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి .

మళ్లీ ఆ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి చిత్ర పరిశ్రమలో మళ్ళీ తమ పేరును ట్రెండ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ అలా ట్రై చేసి సూపర్ గా సక్సెస్  సాధించారు.. తాజాగా అదే లిస్టులోకి జాయిన్ అయిపోతుంది మీరాజాస్మిన్ .

చిత్ర పరిశ్రమ కి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చూడడానికి చబ్బీగా బొద్దుగా ఉన్నా కానీ మీరాజాస్మిన్ అంద చందాలతో కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది . హోంలీ లుక్స్ లో మెరిసిన మీరాజాస్మిన్ ..ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఎలా విమర్శల పాలైందో మనకు బాగా తెలిసిందే. రీసెంట్గా పదేళ్ల తర్వాత తెలుగులో సినిమాల్లో నటించడానికి .. మీరాజాస్మిన్ సిద్ధం గా వుంది.

 తాజాగా మీరాజాస్మిన్ నటించిన సినిమా 'విమానం'. సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ కూడా ఒక పాత్ర లో కనిపించబోతుంది . రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరాజాస్మిన్ ఓ వీడియోని కూడా షేర్ చేసింది . 'చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్న.. ఈ కథ నాకు బాగా నచ్చింది. స్టోరీ వినగానే ఎక్కడో నేను బాగా కనెక్ట్ అయ్యాను .

అందుకే ఓకే చెప్పేసాను సినిమా పూర్తయిన తర్వాత నా మైండ్లో కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి.. అసలు ఈ సినిమా నేను ఎందుకు చేసుకున్నాను . ఎందుకు ఎంపిక చేసుకున్నాను నిజంగా ఈ విమానాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానా..? లేక నన్నే ఈ మూవీ ఎంపిక చేసుకుందా..? అనేది అర్థం కావట్లేదు. ఏదో అంత తికమకగా అయోమయంగా అయితే ఉంది . కానీ ఒకటి మాత్రం నిజం గొప్ప అనుభూతి అయితే పొందాను ' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చిందటా.. దీంతో మీరాజాస్మిన్ లేటెస్ట్ కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: