సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట మ్యాజిక్ షోలు చేస్తూ జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ . జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలా సినిమాల్లో కూడా చేసే అవకాశాలను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బల్లితెరపై ప్రసారమవుతున్న పలు శోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఒక్క షోకు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట సుడిగాలి సుధీర్. 

అయితే తాజాగా సమాచారం ప్రకారం సుడిగాలి సుదీర్ ఇప్పుడు ఒక్కో సినిమాకి స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మొదట సుధీర్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా గాలోడు సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా యావరేజ్ గా నిలచినప్పటికీ రెండవ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. కానీ మూడవ సినిమాగా గాలోడు మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు సుడిగాలి సుధీర్. 

ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో సినిమాకి ఏకంగా రెండు కోట్లకు తక్కువ తీసుకోవడం లేదట సుధీర్. ప్రస్తుతం గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇక ఈ సినిమాలో సుధీర్ కి జోడిగా ఇటీవల తమిళంలో సెన్సేషనల్ గా మారిన యంగ్ హీరోయిన్ దివ్యభారతి నటిస్తోంది.ఈ సినిమా చూడడానికి కాకపోయినా వీరిద్దరి జోడిని అయినా చూడడానికి జనాలు కచ్చితంగా థియేటర్లోకి వస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: